Share News

ఎథ్నిక్‌ ఫ్యూజన్‌ డెకార్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:13 AM

ఆధునిక ఫ్లాట్లలో సైతం మన మూలాలను వెతుక్కునే ప్రయత్నమే ఈ ‘ఎథ్నిక్‌ ఫ్యూజన్‌’. పాశ్చాత్య శైలి సోఫాలు ఉన్నప్పటికీ అక్కడక్కడా మన భారతీయ కళాఖండాలను...

ఎథ్నిక్‌ ఫ్యూజన్‌ డెకార్‌

ఆధునిక ఫ్లాట్లలో సైతం మన మూలాలను వెతుక్కునే ప్రయత్నమే ఈ ‘ఎథ్నిక్‌ ఫ్యూజన్‌’. పాశ్చాత్య శైలి సోఫాలు ఉన్నప్పటికీ అక్కడక్కడా మన భారతీయ కళాఖండాలను జోడించడం ద్వారా ఒక విలక్షణమైన అందం వస్తుంది.

చేనేత, టెక్స్‌టైల్స్‌:

హోం డెకర్‌లో ఇప్పుడు మన దేశీ చేనేతలకు ప్రాధాన్యం పెరిగింది. కలంకారీ ప్రింట్స్‌ ఉన్న కుషన్లు, ఇక్కత్‌ రగ్గులు, రాజస్థానీ జరోకా స్టైల్‌ మిర్రర్స్‌ ఇంటికి సంప్రదాయబద్ధమైన హంగును తెస్తాయి. సోఫా పక్కన ఒక పాతకాలపు చెక్కకుర్చీ లేదా ఉయ్యాల వేయడం ఇప్పుడు పెద్ద ట్రెండ్‌.

ఇత్తడి, రాగి వస్తువులు:

అమ్మమ్మల కాలం నాటి ఇత్తడి గంగాళాలు, దీపపు కుందులు, విగ్రహాలను పాలిష్‌ చేయించి లివింగ్‌ రూమ్‌లో అందంగా అమర్చుతున్నారు. ముఖ్యంగా ఉరులి పాత్రలో నీళ్లు పోసి, అందులో పూరేకులు, తేలియాడే దీపాలు పెట్టడం వల్ల ఇంటికి ప్రశాంతతోపాటు ఐశ్వర్యవంతమైన లుక్‌ వస్తుంది.

టెర్రకోట, మట్టి కళలు:

ప్లాస్టిక్‌ వస్తువులను పక్కనపెట్టి మట్టితో చేసిన కళాఖండాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ ట్రెండ్‌లో భాగం. గోడలపై కొండపల్లి బొమ్మలు లేదా నిర్మల్‌ పెయింటింగ్స్‌ పెట్టడం, టేబుల్స్‌ మీద మట్టితో చేసిన డెకర్‌ పీసులు ఉంచడం వల్ల ఇల్లు సహజంగా కనిపిస్తుంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, మన కళాకారులను ప్రోత్సహించే ఒక చక్కని మార్గం కూడా.

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 02:13 AM