Earwax Health Signs: మీ ఆరోగ్యాన్ని చెబుతుంది
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:27 AM
చెవిలోని గులిమిని సాధారణంగా ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తాం. దాని రంగు లేదా ఆకృతి గురించి మాట్లాడటా నికి చాలామంది ఇష్టపడరు. అయితే, మన శరీరంలోని క్యాన్సర్...
చెవి గులిమి
చెవిలోని గులిమిని సాధారణంగా ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తాం. దాని రంగు లేదా ఆకృతి గురించి మాట్లాడటా నికి చాలామంది ఇష్టపడరు. అయితే, మన శరీరంలోని క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులను గుర్తించడంలో ఈ గులిమి ఒక అద్భుతమైన సూచికగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గులిమి అంటే ఏమిటి?
చెవి వెలుపల భాగంలో ఉండే ‘సెరుమినస్’, ‘సెబేషియస్’ గ్రంథుల నుంచి వచ్చే స్రావాలు, చనిపోయిన చర్మకణాలు, ధూళి కణాల మిశ్రమమే ఈ గులిమి. ఇది మన చెవి లోపలి భాగాన్ని లూబ్రికేట్‌గా ఉంచుతుంది.
రంగులు.. ఆరోగ్య సంకేతాలు
ఆఫ్‌వైట్ నుంచి పసుపు: ఇది తాజాగా ఉన్న గులిమి
నారింజ నుంచి గోధుమ: ఇది పాతబడిన, చిక్కని, జిగటగా ఉండే గులిమి
పాలిపోయిన నారింజ: ఇది పొడిగా ఉన్న పాత గులిమి
బూడిదరంగు: చెవిలో అధికంగా ధూళి చేరిందని అర్థం
ఎప్పుడు జాగ్రత్త పడాలి?
ఆకుపచ్చ రంగు: చెవిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉందని అర్థం
రక్తంతో కూడిన గులిమి: చెవి లోపల గాయాలు, కర్ణభేరి దెబ్బతింటే ఇలా వస్తుంది
నలుపు రంగు: గులిమి విపరీతంగా పేరుకుపోయి గట్టిపడిందని అర్థం
రోగ నిర్ధారణలో సెరుమెనోగ్రామ్
రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల కంటే కూడా గులిమి ద్వారా వ్యాధులను మరింత వేగంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికోసం ‘సెరుమెనోగ్రామ్’ అనే సరికొత్త పరీక్షను అభివృద్ధి చేస్తున్నారు.
క్యాన్సర్ గుర్తింపు: గులిమిలోని 27 సమ్మేళనాల ద్వారా శరీరంలోని క్యాన్సర్ ఉనికిని ముందుగానే గుర్తించవచ్చు. బ్రెజిల్‌లోని కొన్ని ఆసుపత్రులలో ఇప్పటికే ఈ విధానాన్ని వాడుతున్నారు.
మెనియర్స్ వ్యాధి: గులిమిలో ఉండే ఫ్యాటీ యాసిడ్ల స్థాయిని బట్టి ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చు.
ఇతర వ్యాధులు: మధుమేహం, పార్కిన్సన్స్, అల్జీమర్స్, గుండె జబ్బుల ముందస్తు సంకేతాలను కూడా ఇది వెల్లడిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి