Share News

చున్నీలో చమక్కుమనేలా...

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:25 AM

చున్నీ ఎలా ధరించినా చూడముచ్చటగానే ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ధరించినా, ఆధునికత జోడించి వినూత్న స్టైల్‌ను అనుసరించినా చున్నీ అందం ఏమాత్రం...

చున్నీలో చమక్కుమనేలా...

చున్నీ ఎలా ధరించినా చూడముచ్చటగానే ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో ధరించినా, ఆధునికత జోడించి వినూత్న స్టైల్‌ను అనుసరించినా చున్నీ అందం ఏమాత్రం తరగదు. పలు రకాల చున్నీలు, వాటిని ధరించే స్టైల్స్‌ మీకోసం.

  • చుడీదార్‌ అందమంతా చున్నీలోనే ఉంటుంది. లేత రంగు చుడీదార్‌కు కలర్‌ఫుల్‌ చున్నీ జోడిస్తే, మోడర్న్‌ వేర్‌ను మించిపోతుంది. కాబట్టే ఎన్ని రకాల ఆధునిక దుస్తులు మార్కెట్లో విడుదల అవుతున్నా, చుడీదార్‌లకు ఆదరణ తరగడం లేదు.

  • గద్వాల్‌, పోచంపల్లి, కలంకారీ...ఏ రకం చుడీదార్‌ అయినా, వాటికి తగిన చున్నీలు మార్కెట్లో బోలెడన్ని! అయితే వేసుకున్న డ్రెస్‌కు తగ్గట్టు చున్నీ ధరించే స్టయిల్‌ను మారుస్తూ ఉండాలి.

  • హై నెక్‌, లో నెక్‌, కాలర్‌ నెక్‌...చుడీదార్‌లు ఎలాంటి మోడల్‌లో కుట్టించుకున్నా చున్నీలు సూటవుతాయి. నెక్‌ మోడల్‌ కనిపించేలా చున్నీలను భుజం మీద వేసుకుంటే అందానికి అందం, స్టయిల్‌కు స్టయిల్‌!

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 02:25 AM