తప్పుల్ని ఎంచే ముందు...
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:37 AM
ఇతరులలో తప్పులను ఎంచడం మానవ ప్రవృత్తి. ఎవరైనా తప్పు చేసినప్పుడు... వారు ఉద్దేశపూర్వకంగానే చేశారని మనం తరచుగా అనుకుంటాం. అయితే... విశాలమైన దృక్పథంతో చూసినప్పుడు... తప్పు చేసిన ప్రతి వ్యక్తీ బాధితుడే. చదువు లేకపోవడం, సమాచారం లేకపోవడం, అధిక ఒత్తడి, సంకుచిత మనస్తత్వం... వీటికి వారు బాధితులు కావచ్చు.
ఇతరులలో తప్పులను ఎంచడం మానవ ప్రవృత్తి. ఎవరైనా తప్పు చేసినప్పుడు... వారు ఉద్దేశపూర్వకంగానే చేశారని మనం తరచుగా అనుకుంటాం. అయితే... విశాలమైన దృక్పథంతో చూసినప్పుడు... తప్పు చేసిన ప్రతి వ్యక్తీ బాధితుడే. చదువు లేకపోవడం, సమాచారం లేకపోవడం, అధిక ఒత్తడి, సంకుచిత మనస్తత్వం... వీటికి వారు బాధితులు కావచ్చు. ఇవన్నీ తప్పు చేయడానికి కారణం అవుతాయి. ఇతరులు తప్పు చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు అపరాధ భావన కలుగుతుంది. కాబట్టి ఇతరుల తప్పుల వెనుక ‘ఉద్దేశాన్ని’ చూడకండి, తప్పును తప్పుగానే చూడండి.
ఒక జ్ఞాని ఇతరులలో తప్పులను గమనించినప్పుడు... దయతో, కరుణతో వారు వాటినుంచి బయటపడడానికి సహాయం చేస్తాడు. కానీ మూర్ఖుడు వేరొకరు తప్పు చేస్తే సంతోషిస్తాడు. ఆ విషయాన్ని లోకానికి చాటిచెప్పి గర్వపడతాడు. జ్ఞాని ఎల్లప్పుడూ ఇతరులను ప్రశంసిస్తాడు. జ్ఞానం అంటే ఆత్మను ఉత్తేజపరచడం. మీరు స్థిరంగా ఉన్నప్పుడే మీ చుట్టూ ఉన్నవారిని ఉత్తేజపరచగలరు. భయం, అపరాధభావన, కోపం, దుఃఖం లాంటి ప్రతికూల భావోద్వేగాలన్నీ జ్ఞానం ద్వారా తొలగిపోతాయి. అప్పుడు మీ మనస్సు స్థిరంగా, కేంద్రీకృతమై ఉంటుంది. ఆ స్థితికి చేరుకున్నాక... మీరు చెయ్యాలనుకున్నా తప్పులు చేయలేరు. .
శ్రీశ్రీరవిశంకర్
ఈ వార్తలను కూడా చదవండి