ప్రహరీ కూలిన ఘటనలో మృతి చెందిన.. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:33 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రహరీ కూలిన ఘటనలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ కుటుం బానికి మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రూ.5 లక్షల చెక్కును అందజేశారు.
సాలూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రహరీ కూలిన ఘటనలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ కుటుం బానికి మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.