Share News

రెండో రోజులకే మళ్లీ వెనక్కి

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:33 PM

రెండు రోజుల కిందట ఒడిశా సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లిన ఏనుగులు మళ్లీ వెనక్కి వచ్చేశాయి.

రెండో రోజులకే మళ్లీ వెనక్కి
పూర్ణపాడు పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

- ఒడిశా నుంచి తిరిగి వచ్చిన ఏనుగులు

- పూర్ణపాడులో సంచారం

కొమరాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రెండు రోజుల కిందట ఒడిశా సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లిన ఏనుగులు మళ్లీ వెనక్కి వచ్చేశాయి. గురువారం ఉదయం తిరిగి పూర్ణపాడుకు చేరుకున్నాయి. గ్రామంలోని పత్తి, వరి పొలాల్లో సంచరిస్తున్నాయి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఏనుగులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

బొమ్మికలో మరో గుంపు..

భామిని, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొమ్మిక గ్రామంలోకి గురువారం వేకువజామున మరో ఏనుగుల గుంపు వచ్చేందుకు ప్రయత్నించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై వాటిని అడ్డుకున్నారు. సమీపంలోని ఆయిల్‌పామ్‌ మొక్కలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా పక్కుడిభద్ర, బొమ్మిక ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో పొలం పనులకు వెళ్లేందుకు గ్రామస్థులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్‌ బీట్‌ అధికారి కేశవతో పాటు సిబ్బంది సూచించారు.

Updated Date - Aug 27 , 2026 | 11:33 PM