Hope for Joint Repair: మృదులాస్థి పునరుద్ధరణ సాధ్యమే
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:27 AM
వృద్ధాప్యంతో సంబంధం ఉన్న ఒక ప్రొటీన్‌ను నిరోధించడం వల్ల, వయసు పైబడిన ఎలుకల్లో అరిగిపోయిన మృదులాస్థిని పునరుద్ధరించగలిగినట్టు శ్టాన్‌ఫోర్ట్ పరిశోధకులు తాజాగా...
పరిశోధన
వృద్ధాప్యంతో సంబంధం ఉన్న ఒక ప్రొటీన్‌ను నిరోధించడం వల్ల, వయసు పైబడిన ఎలుకల్లో అరిగిపోయిన మృదులాస్థిని పునరుద్ధరించగలిగినట్టు శ్టాన్‌ఫోర్ట్ పరిశోధకులు తాజాగా పేర్కొన్నారు. ఇంజెక్షన్ ద్వారా సాగే ఈ చికిత్స... మృదులాస్థిని పునర్నిర్మించడంతో పాటు, ఎసిఎల్ టేర్స్ లాంటి మోకీళ్ల గాయాల వల్ల తలెత్తే కీళ్ల అరుగుదలకు కూడా అడ్డుకట్ట వేస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ చికిత్సకు సంబంధించిన మాత్ర ఆధారిత వెర్షన్‌ను ఇప్పటికే కొన్ని వైద్య ప్రయోగాల్లో పైబడే వయసుతో కూడిన కండరాల బలహీనత చికిత్సలో ఉపయోగించడం జరిగింది. ఈ చికిత్స సత్ఫలితాలను కనబరిచింది. అలాగే కీళ్ల మార్పిడి సమయంలో సేకరించిన మోకీలి కణజాలం ఈ చికిత్సకు సానుకూలంగా స్పందించింది. ఈ ఫలితాల ఆధారంగా పైబడే వయసు ఫలితంగా లేదా కీళ్ల అరుగుదల ఫలితంగా కోల్పోయిన మృదులాస్థిని, ఇంజెక్షన్ లేదా మాత్రల ద్వారా పునరుద్ధరించి, మోకీళ్లు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అడ్డుకట్ట వేయొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి