Share News

Blazers for Women Wear: బ్లేజర్స్‌ బేష్

ABN , Publish Date - Jan 08 , 2026 | 05:22 AM

ఉద్యోగినులు సౌకర్యంగా, హూందాగా కనిపించే బ్లేజర్స్‌ను ఆఫీస్‌ వేర్‌గా ఎంచుకుంటున్నారు. వాటి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్లేజర్స్‌లో మరింత భేషుగ్గా కనిపించవచ్చు...

Blazers for Women Wear: బ్లేజర్స్‌ బేష్

ఉద్యోగినులు సౌకర్యంగా, హూందాగా కనిపించే బ్లేజర్స్‌ను ఆఫీస్‌ వేర్‌గా ఎంచుకుంటున్నారు. వాటి ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, బ్లేజర్స్‌లో మరింత భేషుగ్గా కనిపించవచ్చు.

ఇలా ధరించాలి

  • బ్లేజర్స్‌ను టీ షర్ట్‌తో కలిపి ధరించవచ్చు. సాదా రంగు టీ షర్ట్స్‌ బ్లేజర్లకు సూటవుతాయి

  • బ్లేజర్స్‌తో స్కర్ట్‌ను కూడా మ్యాచ్‌ చేయవచ్చు. అయితే రెండింటి రంగులూ ఇంచుమించు ఒకేలా ఉండేలా చూసుకోవాలి అలాగే ఫిట్టింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి

  • జీన్స్‌, టీ షర్ట్‌లతో కలిపి బ్లేజర్‌ను ధరించవచ్చు

  • అదనపు ఆకర్షణ కోసం మెడలో స్కార్ఫ్‌ కూడా వేసుకోవచ్చు

  • క్రాప్‌ టాప్‌తో కూడా బ్లేజర్‌ను మ్యాచ్‌ చేయవచ్చు.

యాక్సెసరీస్‌

  • బ్లేజర్‌తో పెన్సిల్‌ హీల్‌, ఫార్మల్‌ షూస్‌ వేసుకోవచ్చు

  • చెవులకు స్టడ్స్‌, చేతికి వాచ్‌ తప్పనిసరి

  • ఆభరణాలు అవసరం లేదు

  • స్కర్ట్‌తో మ్యాచ్‌ చేసినప్పుడు, మెడలో సన్నని చైన్‌ వేసుకోవచ్చు

మేకప్‌ ఇలా

  • లేత రంగు లిప్‌స్టిక్‌ ఎంచుకోవాలి

  • బ్రష్‌, ఐ షాడో వీలైనంత తగ్గించాలి

  • న్యాచురల్‌ మేక్‌పకు ప్రాధాన్యం ఇవ్వాలి

  • చేతి వేళ్ల గోళ్లు గ్రూమింగ్‌ చేసుకుని ఉండాలి.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2026 | 05:23 AM