మేని మెరుపులకు..!
ABN , Publish Date - May 30 , 2026 | 01:10 AM
రసాయనాలతో కూడిన సౌందర్య సాఽధనాలు వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఎలాగంటే...
రసాయనాలతో కూడిన సౌందర్య సాఽధనాలు వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఎలాగంటే...
కలబంద గుజ్జును రెండుసార్లు మంచినీటిలో కడిగి ఆపైన ముఖానికి పట్టించి పావుగంట తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే మురికి, మృతకణాలు తొలగి చర్మం ఛాయగా మెరుస్తుంది.
చెంచా పసుపులో చెంచా తేనె కలిపి వేలితో ముఖంపై పలుచని పూతలా రాసి పది నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. మొటిమల సమస్య తీరుతుంది.
ముఖానికి వేసుకున్న మేక్‌పను కొబ్బరినూనెతో తొలగిస్తే చర్మానికి పలురకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖంపై గీతలు, ముడుతలు ఏర్పడవు. చర్మం బిగుతుగా మారుతుంది
చిన్న గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, నాలుగు చెంచాల పెరుగు వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాలు ఆరనిచ్చి చేతి వేళ్లతో కింది నుంచి పైకి గుండ్రంగా మర్ధన చేస్తూ పిండిని తొలగించాలి. ఆపైన చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మెరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News