చామనఛాయ మెరుపులీనేలా...
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:55 AM
కొందరు చామనఛాయలో ఉంటారు. అలాంటి వారు ఎలాంటి మేకప్ వేసుకోవాలో చూద్దాం...
కొందరు చామనఛాయలో ఉంటారు. అలాంటి వారు ఎలాంటి మేకప్ వేసుకోవాలో చూద్దాం.
హైడ్రేషన్: తగినంత హైడ్రేషన్ లోపిస్తే చర్మం మరింత నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి లైట్‌వెయిట్ మాయిశ్చరైజర్‌తో మేకప్ మొదలుపెట్టాలి. దీంతో చర్మం మెరుపులీనే కాన్వా్‌సలా మారిపోతుంది
కలర్ కరెక్ట్: కళ్ల కింద నల్లని వలయాలను మాయం చేయడం కోసం లేదా పిగ్మెంటేషన్‌ను కనిపించకుండా చేయడం కోసం ఆరెంజ్ లేదా పీచ్ కలర్ కరెక్టర్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఫౌండేషన్ మొదలుపెట్టాలి
ఫ్లాష్ బ్యాక్: పసుపు రంగు లేదా తెలుసు సెట్టింగ్ పౌడర్లను వాడుకోకూడదు. బదులుగా న్యూట్రల్ అండర్‌టోన్ పౌడర్లను ఎంచుకోవాలి
బ్రాంజర్: ముదురు రంగు స్కిన్ టోన్స్ కోసం న్యూట్రల్ బ్రౌన్ బ్రాంజర్‌ను ఎంచుకోవాలి. అప్పుడే ఫౌండేషన్ మరీ ఫ్లాట్‌గా మారిపోకుండా ఉంటుంది.
బ్లష్: పీచ్, టాంజరీన్ టోన్స్ చర్మానికి అందమైన మెరుపును అందిస్తాయి. కాబట్టి ప్లమ్, బెర్రీ, వైన్ రంగుల్లో బ్లషె్‌సను ఎంచుకోవాలి
హైలైట్స్: ఐసీ సిల్వర్ హైలైట్స్, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కాబట్టి వాటికి బదులుగా లిక్విడ్ ఫార్ములాలను ఎంచుకోవాలి
బ్రోస్: డీప్ బ్రూనెట్, డార్క్ గ్రే, లేదా సాఫ్ట్ బ్లాక్ పెన్సిల్‌తో కనుబొమలు దిద్దుకోవాలి. ఫ్లాట్‌గా ఉండే జెట్‌బ్లాక్ పెన్సిళ్ల వాడకం మానేయాలి
కనురెప్పలు: ఎమరాల్డ్ గ్రీన్, శాఫైర్ బ్లూ, గోల్డ్ లేదా బ్రాంజ్ మెటాలిక్ షేడ్స్ ఎంచుకోవాలి
లిప్‌స్టిక్స్: న్యూడ్స్ కోసం బ్రౌన్ బేస్‌డ్ షేడ్స్ ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News