Share News

ఫేస్‌ షేవింగ్‌ సురక్షితమేనా?

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:18 AM

ఫేస్‌ షేవింగ్‌తో రోమాల పెరుగుదల ఉధృతమవుతుందనీ, మరింత మందంగా, ఒత్తుగా పెరగడం మొదలుపెడతాయనీ ఎంతోమంది అపోహపడుతూ...

ఫేస్‌ షేవింగ్‌ సురక్షితమేనా?

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! ముఖం మీద అవాంఛిత రోమాలను వదిలించుకోవడం కోసం ఫేస్‌ షేవింగ్‌ చేస్తున్నాను. కానీ ఇలా షేవ్‌ చేయడం వల్ల రోమాలు మరింత ఒత్తుగా పెరుగుతాయని అంటున్నారు. ఇదెంతవరకూ నిజం?

ఓ సోదరి, హైదరాబాద్‌

ఫేస్‌ షేవింగ్‌తో రోమాల పెరుగుదల ఉధృతమవుతుందనీ, మరింత మందంగా, ఒత్తుగా పెరగడం మొదలుపెడతాయనీ ఎంతోమంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. షేవింగ్‌లో చర్మం ఉపరితలం దగ్గరున్న రోమాలు తొలగిపోతాయి. అంతే తప్ప ఈ పనితో వాటి మందం, రంగం, దిశలు ఏమాత్రం మారవు. నిజానికి మిగతా అవాంఛిత రోమాల తొలగింపు ప్రక్రియంలో పోల్చుకుంటే ఫేస్‌ షేవింగ్‌ అతం్యత సురక్షితమైనది. వ్యాక్సింగ్‌, త్రెడింగ్‌ లాంటి నొప్పి, అసౌకర్య విధానలకు భిన్నంగా ఫేస్‌ షేవింగ్‌తో సులభంగా, సురక్షితంగా ఇంట్లోనే ముఖం మీది రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు. ఇలా ముఖాన్ని షేవ్‌ చేసుకోవడం వల్ల, చర్మం మీది మృతకణాలు కూడా తొలగిపోయి, చర్మం నునుపుగా మారుతుంది. దాంతో మాయిశ్చరైజర్‌ లాంటి ఉత్పత్తులు చర్మంలోకి సులభంగా ఇంకిపోతాయి.


ఫేస్‌ షేవింగ్‌ ఇలా...

ఫేస్‌ షేవింగ్‌ పద్ధతిని సక్రమంగా అనుసరించాలి. అప్పుడే చక్కని ఫలితాన్ని రాబట్టగలుగుతాం! అందుకోసం...

  • షేవింగ్‌కు ముందు ముఖ చర్మం శుభ్రంగా ఉండాలి. సున్నితమైన క్లీన్సర్‌తో ముఖం మీది జిడ్డు, ధూళి, మేక్‌పను వదిలించుకోవాలి. ఈ పనితో చర్మరంథ్రాలు మూసుకుపోయే ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది

  • అలోవేరా జెల్‌, మాయిశ్చరైజర్‌ లేదా షేవింగ్‌ జెల్‌ను పలుచగా ముఖం మీద పరిచి, ఆ తర్వాతే షేవింగ్‌ మొదలుపెట్టాలి

  • షేవింగ్‌ చేస్తున్న ప్రదేశాన్ని సాగదీసి పట్టుకోవాలి. దీంతో రేజర్‌ చర్మం మీద సులభంగా జరుగుతుంది, కోతలు కూడా ఏర్పడకుండా ఉంటాయి

  • రేజర్‌ను ఏటవాలుగా ఉంచి ఉపయోగించాలి. అలాగే ఒత్తిడి ఉపయోగించకుండా నెమ్మదిగా కదిలించాలి

  • పై పెదవి, దవడ, కనుబొమల దగ్గర మరింత నెమ్మదిగా రేజర్‌ను కదిలించాలి

  • షేవింగ్‌ చేసిన రోజు రెటినాయిడ్స్‌ లాంటి వాటికి దూరంగా ఉండాలి

షేవింగ్‌ తర్వాత...

అలోవేరా జెల్‌ లేదా మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. 24 గంటల వరకూ మృతకణాలను తొలగించే ఉత్పత్తులు వాడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి.

డాక్టర్‌ రజిత

డెర్మటాలజిస్ట్‌, హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 04:18 AM