ఎగ్జిమా పెరగదమ్మా...
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:05 AM
ఎగ్జిమా చర్మ సమస్య కలిగిన వాళ్లు స్నానం చేస్తే, చర్మంలోని సహజసిద్ధ నూనెలు తొలగిపోయి, సమస్య మరింత తీవ్రమవుతుందని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. కానీ ఈ సమస్య...
అధ్యయనం
ఎగ్జిమా చర్మ సమస్య కలిగిన వాళ్లు స్నానం చేస్తే, చర్మంలోని సహజసిద్ధ నూనెలు తొలగిపోయి, సమస్య మరింత తీవ్రమవుతుందని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. కానీ ఈ సమస్య ఉన్న వాళ్లు ఆ భయాలేమీ లేకుండా కావలసినన్ని సార్లు స్నానం చేయొచ్చని ఒక తాజా అధ్యయనం నిర్థారించింది. రోజూ స్నానం చేసే ఎగ్జిమా రోగులు, వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేసే ఎగ్జిమా రోగుల మఽధ్య ఎగ్జిమా తీవ్రతలను పరిశీలించినప్పుడు, రోజూ స్నానం చేసిన వారిలో చర్మం పొడిబారడం, దురదలు పెరగడం లాంటి లక్షణాలు కనిపించలేదు. ఇంగ్లండ్‌లో 438 ఎగ్జిమా రోగుల మీద చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా ఎగ్జిమా ఉన్నప్పటికీ ఎటువంటి భయాలూ లేకుండా ప్రతిరోజూ స్నానం చేయొచ్చని పరిశోధకులు నిర్థారించారు. ఈ చర్మ సమస్యతో బాధపడే లక్షల మంది బాధితులకు ఈ వార్త ఊరటను కలిగిస్తోంది. నిష్ఠతో కూడిన దైనందిన జీవితాన్ని గడపడానికి బదులుగా సౌకర్యవంతమైన జీవనశైలిని గడిపే వెసులుబాటును బాధితులకు కల్పిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News