అందానికి అరటి తొక్క
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:52 AM
ఎన్నో పోషకాలతో నిండిన అరటి పండు తొక్క... సౌందర్య సాధనంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం...
ఎన్నో పోషకాలతో నిండిన అరటి పండు తొక్క... సౌందర్య సాధనంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం...
అరటి తొక్కలో సహజ నూనెలు అధికంగా ఉంటాయి. ఈ తొక్కతో ముఖంపై మృదువుగా మర్దన చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
అరటి తొక్కపై కొద్దిగా కొబ్బరినూనె రాసి దానితో ముఖాన్ని రుద్దుకుంటే తగినంత తేమ అంది చర్మం బిగుతుగా మారుతుంది
మొటిమలపై అరటి తొక్కతో అద్దుతూ ఉంటే రెండు రోజుల్లో అవి మాయమవుతాయి. అరటి తొక్కలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి మరల మొటిమలు రాకుండా కాపాడతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని నివారిస్తాయి.
బాగా పండిన అరటిపండు తొక్కతో ముఖంపై గుండ్రంగా రుద్దితే ఎండలో తిరగడం వల్ల ఏర్పడే ట్యాన్ తొలగిపోతుంది. ఎండ వల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలుగుతుంది.
రాత్రి పడుకునేముందు ముఖంపై అరటి తొక్కతో మర్దన చేసుకుంటే చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముడుతలు, గీతలు మాయమవుతాయి. మురికి, మృతకణాలు తొలగి ముఖం ఛాయగా కనిపిస్తుంది.
అరటి తొక్కతో కళ్ల చుట్టూ సున్నితంగా రుద్దుతుంటే నల్లని వలయాలు, వాపు, ఉబ్బు లాంటివి తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగై కళ్లు ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.
పులిపిర్లపై అరటి తొక్క ముక్కను ఉంచి కట్టు కడితే రెండు రోజుల్లో అవి రాలిపోతాయి.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News