మహిళలు వేదికెక్కితే వినాశనం
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:33 AM
మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటకుండా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని కేరళం రాష్ట్రానికి చెందిన ఇస్లాం మతపెద్ద అబూబకర్ ముస్లియార్ వివాదాస్పద..
వారు ఇంటికే పరిమితం కావాలి
ఖురాన్ కూడా ఇదే చెబుతోంది
అందుకే ఇస్లాంలో ‘పరదా’ సంస్కృతి
మత పెద్ద అబూబకర్ వ్యాఖ్యలు
కొచ్చి, ఆగస్టు 31: మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటకుండా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని కేరళం రాష్ట్రానికి చెందిన ఇస్లాం మతపెద్ద అబూబకర్ ముస్లియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు వేదికలు ఎక్కి, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటే.. మహా వినాశనానికి దారితీస్తుందన్నారు. అందుకే, మహిళలు బహిరంగ వేదికలు ఎక్కకుండా ఇస్లాంలో ‘పరదా’ సంస్కృతి ఉందని, ఇది వారిని వేదికలు ఎక్కకుండా నివారిస్తుందని వ్యాఖ్యానించారు. సున్నీ-షఫీ ఇస్లామిక్ మేధావుల రాష్ట్రస్థాయి ప్రధాన మండలి.. ‘సమస్త కేరళ జమియ్యతుల్ ఉలామా’కు చెందిన ప్రధాన కార్యదర్శి అబూబకర్.. ఆదివారం కొచ్చిలో నిర్వహించిన ఇస్లామిక్ సదస్సులో మాట్లాడారు. ‘‘మహిళలు ఇంటికే పరిమితమై జీవించాలని, బహిరంగంగా వారు కనిపించరాదని ఖురాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. మత గ్రంథాలను అధ్యయనం చేసిన వారిగా ఈ అంశంపై మాట్లాడే బాధ్యత మాకుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కేరళం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ, సీపీఎం నాయకురాలు పీకే శ్రీమతి తీవ్రంగా ఖండించారు. ‘‘ఆ చీకటి రోజులు పోయాయి.. తెలుసుకోండి.’’ అని వ్యాఖ్యానించారు. అబూబకర్ వ్యాఖ్యలు కేరళం సహా ప్రపంచంలోని మహిళలను అవమానించడమేనని నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి