రీల్స్‌కు బానిసైన మహిళ..
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:20 AM
ఫోన్‌లో నిరంతరం రీల్స్ చూడటానికి అలవాటుపడిన ఓ 52 ఏళ్ల మహిళ.. ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదనే కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన...
ఇంటర్నెట్ లేక, వీడియోలు రాక ఆత్మహత్య
కోర్బా(ఛత్తీస్‌గఢ్), సెప్టెంబర్ 8: ఫోన్‌లో నిరంతరం రీల్స్ చూడటానికి అలవాటుపడిన ఓ 52 ఏళ్ల మహిళ.. ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదనే కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. కోర్బా జిల్లా, కేరాకచ్చర్ గ్రామానికి చెందిన మంగ్లో బాయ్ సారథి రీల్స్ చూడటానికి తీవ్రంగా బానిసైంది. శనివారం కూడా ఇంట్లో రీల్స్ చూస్తున్న సమయంలో, సిగ్నల్స్ సరిగ్గా రాక వీడియోలు పదేపదే ఆగిపోయాయి. నెట్‌వర్క్ ఆగిపోతుండటంతో తీవ్ర అసహనానికి లోనైన మంగ్లోబాయ్ ఆవేశంలో తన ఫోన్‌ను నేలకేసి పగలగొట్టింది. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగేసింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కోర్బాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు