గంగా తీరంలో వైమానిక గర్జన
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:48 AM
గంగా తీరంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానాలు గర్జించాయి.
వారాణసీలో ‘వింగ్స్ ఓవర్ గంగాస్’ పేరిట విన్యాసాలు
వారాణసీ, అక్టోబరు 25: గంగా తీరంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానాలు గర్జించాయి. ఉత్తరప్రదేశ్లోని వారాణసీలో నమో ఘాట్ వద్ద ‘వింగ్స్ ఓవర్ గంగాస్’ పేరిట ఆదివారం నిర్వహించిన వైమానిక ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాయుసేనకు చెందిన ప్రముఖ యుద్ధ విమానాలు గగనతలంలో అద్భుత విన్యాసాలు ప్రదర్శించాయి. భారత వైమానిక దళం ఏర్పడి 94 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3రోజులపాటు నిర్వహించిన ఈ ఎయిర్ షో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో సుఖోయ్-30 ఎంకేఐ, స్వదేశీ తేజస్ వంటి యుద్ధ విమానాలతోపాటు, ఎస్సీహెచ్ ప్రచండ్ వంటి అత్యాధునిక హెలికాప్టర్లు పాల్గొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి
వసుధైక కుటుంబం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం: జైశంకర్