వాట్సప్‌లో ట్రావెల్ ‘ఈ-సిమ్’ సదుపాయం
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:59 AM
తరచూ విదేశాలకు వెళ్లే వారి తిప్పల తిప్పలకు చెక్ పెట్టేందుకు వాట్సప్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది
నంబరు మార్చకుండానే ఫోన్ కాల్స్, చాటింగ్
న్యూఢిల్లీ, నవంబరు 27: తరచూ విదేశాలకు వెళ్లే వారి తిప్పల తిప్పలకు చెక్ పెట్టేందుకు వాట్సప్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. తన యాప్ ద్వారా ట్రావెల్ డేటా ‘ఈ-సిమ్’ కొని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. విదేశాల్లో ఉన్నా ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబరుతోనే వాట్సప్ ద్వారా ఫోన్ కాల్స్, చాటింగ్ చేసుకోవచ్చు. ఈ-సిమ్‌ల కోసం వాట్సప్ ఇప్పటికే రిలయన్స్ జియోతో సహా మూడు ప్రముఖ విదేశీ టెలికం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని కంపెనీలతో ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోంది. అయితే ఎప్పటి నుంచి, ఏయే దేశాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేది, వాటి చార్జీల వివరాలు ఇంకా వెల్లడించలేదు
ఈ వార్తలూ చదవండి
నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం
త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా