పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో..
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:57 PM
ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక పెళ్లి రోజున ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్‌తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. దీంతో పెళ్లి కొడుకుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
ఆగ్రా, మార్చి 12: ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక పెళ్లి రోజున ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్‌తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. దీంతో పెళ్లి కొడుకుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఎంట్రీతో పెళ్లి ఆగిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. షామ్లీకి చెందిన ఓ యువకుడికి ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో పెళ్లి కుదిరింది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరుడి కుటుంబం బరాత్‌తో పెళ్లి కూతురి ఇంటికి వెళ్లింది.
అక్కడికి వెళ్లిన తర్వాత వారికి ఊహించని షాక్ తగిలింది. మీరట్‌కు చెందిన యువకుడి ఫ్యామిలీ కూడా అదే బాలికతో పెళ్లి కోసం బరాత్‌తో ఆమె ఇంటికి వచ్చింది. పెళ్లి కూతురి కోసం రెండు కుటుంబాలు గొడవ పడ్డాయి. ఆ బాలికకి తమ అబ్బాయితో పెళ్లి ఫైనల్ అయిందని షామ్లీ నుంచి వచ్చిన ఫ్యామిలీ అంది. మీరట్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కూడా ఇదే విషయం చెప్పింది. గ్రామస్థులు కలుగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. గొడవ ఆగకపోగా మరింత పెద్దదైంది. దీంతో పోలీసులకు సమాచారం వెళ్లింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గొడవను ఆపారు. పెళ్లి కూతురు మైనర్ అని తెలియటంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పెళ్లి కూతురు మైనర్ అని ధ్రువీకరించుకున్న తర్వాత వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్‌కు భారీ షాక్