దీక్షను కొనసాగిస్తా
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:19 AM
కాక్రోచ్ జనతాపార్టీ పిలుపుతో చేపట్టిన చలో పార్లమెంటు ప్రదర్శనపై పోలీసుల దమనకాండకు నిరసనగా తన నిరశన దీక్ష కొనసాగిస్తానని వాంగ్ చుక్ స్పష్టం చేశారు...
పోలీసుల చర్య కలచివేసింది: వాంగ్ చుక్
న్యూఢిల్లీ, జూలై 20: కాక్రోచ్ జనతాపార్టీ పిలుపుతో చేపట్టిన చలో పార్లమెంటు ప్రదర్శనపై పోలీసుల దమనకాండకు నిరసనగా తన నిరశన దీక్ష కొనసాగిస్తానని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. ‘‘ఎంపీలతో పార్లమెంటులో మాట్లాడేందుకు కాక్రోచ్ జనతాపార్టీ యువ నాయకులను అనుమతించాలి. లేదంటే ఆస్పత్రిలో తనను కలిసేందుకు వారిని అనుమతించాలి’’ అని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన చేతిరాతతో కూడిన ప్రకటనను వాంగ్ చుక్ భార్య గీతాంజలి ‘ఎక్స్‌లో పోస్టు చేశారు. శాంతియుత ప్రదర్శనను అడ్డుకుని యువకులను నిర్బంధించిన పద్ధతి తనను కలచివేసిందని అందులో వాంగ్‌చుక్ తెలిపారు. కాగా, యువకుల ప్రదర్శన నడుస్తుండగానే, కాక్రోచ్ జనతాపార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోశ్ రెంకాలతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. తమ డిమాండ్ల జాబితాను ఆయనకు నాయకులు అందించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన నిరశనను కొనసాగించాలని వాంగ్‌చుక్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు... చలో పార్లమెంటులో పాల్గొనేందుకు తాత్కాలికంగా డిశ్చార్జి చేయాలంటూ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వాంగ్‌చుక్ లేఖ రాశారు. కాగా, సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌కు అందిస్తున్న వైద్యంపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మెరుగైన వైద్యం కోసం వాంగ్ చుక్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.