Share News

ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ పూర్తి

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:07 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం 6 రాష్ట్రాలు, 3కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎన్నికల సంఘం..

ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ పూర్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం 6 రాష్ట్రాలు, 3కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తయింది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌, కేరళ, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌-నికోబార్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఈ కార్యక్రమం పూర్తయినట్టు పేర్కొంది. మరణించినవారు, శ్వాశ్వతంగా వలసవెళ్లిన వారు, ఒకటికన్నా ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నవారు, అర్హత లేని వారి పేర్లను తొలగించినట్టు తెలిపింది. అర్హుల పేర్లను నమోదు చేసినట్టు వివరించింది. గుజరాత్‌లో అత్యధికంగా 68.12 లక్షల ఓట్ల(13.03ు)ను తొలగించింది. మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు, రాజస్థాన్‌లో 31.36 లక్షలు, ఛత్తీ్‌సగఢ్‌లో 24.99 లక్షలు, కేరళలో 8.97 లక్షలు, గోవాలో 1.27 లక్షల ఓట్లను తొలగించినట్టు వివరించింది. లక్షదీ్‌పలో కేవలం 206 ఓట్లను మాత్రమే తొలగించడం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:07 AM