జూమ్ కాల్‌లో 900 మందిపై వేటేసిన
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:46 AM
ఐదేళ్ల క్రితం నాలుగు నిమిషాల జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను ఉన్నఫళంగా తొలగించి విమర్శల పాలైన భారత...
సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగం ఊస్ట్
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఐదేళ్ల క్రితం నాలుగు నిమిషాల జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను ఉన్నఫళంగా తొలగించి విమర్శల పాలైన భారత సంతతి సీఈవో విశాల్ గార్గ్.. ఇప్పుడు తన సొంత కంపెనీ నుంచే ఉద్వాసనకు గురయ్యారు. అమెరికాలోని ఆయన మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ బోర్డు ఆయనను సీఈవో పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో కొద్ది రోజుల క్రితమే బోర్డులో చేరిన డానియెల్ లూయి్‌సకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. బోర్డు నిర్ణయంపై గార్గ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లూయిస్ తనను మోసం చేశాడని అన్నారు. దీనిపై గార్గ్ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, కంపెనీ లాభాల్లోకి వచ్చేవరకూ ఏడాదికి 1 డాలర్ జీతానికే పనిచేస్తానని, ఆ తర్వాత తానే సీఈవో పదవి నుంచి తప్పుకొంటానని బోర్డుకు ప్రతిపాదించారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు