విశాఖలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:17 AM
ఉగ్రవాద వ్యతిరేక కేసులను వేగంగా పరిష్కరించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా...
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఉగ్రవాద వ్యతిరేక కేసులను వేగంగా పరిష్కరించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజస్థాన్, బిహార్‌లలో కొత్తగా మూడు ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఏపీలోని విశాఖపట్నం, రాజస్థాన్‌లోని జైపూర్, బిహార్‌లోని పట్నాలో ఈ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేవలం ఎన్‌ఐఏ దర్యాప్తు చేసే కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు