Share News

టీఎంసీ ఎంపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన స్థానికులు

ABN , Publish Date - May 31 , 2026 | 09:37 PM

పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా మధురాపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాపీ హల్దార్ పార్టీ కార్యాలయంపై స్థానికులు ఆదివారంనాడు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వరద సహాయక సామగ్రిని అక్రమంగా పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు.

టీఎంసీ ఎంపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన స్థానికులు
TMC MP party office Vandalised

కోల్‌కతా: సౌత్ 24 పరగణాల జిల్లా మధురాపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాపీ హల్దార్ (Bapi Haldar) పార్టీ కార్యాలయంపై స్థానికులు ఆదివారంనాడు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వరద సహాయక సామగ్రిని అక్రమంగా పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోనికి తెచ్చినట్టు చెప్పారు.


స్థానికుల దాడిలో ఎంపీ కార్యాలయం అద్దాలు, సైన్ బోర్టులు ధ్వంసం అయ్యాయి. మంచినీటి వనరులు ఉన్న చోట అక్రమంగా పార్టీ కార్యాలయం కట్టారని, అందులో వరద సహాయక సామగ్రిని నిల్వ చేశారని స్థానికులు ఆరోపించారు.


కాగా, రాష్ట్రంలో అధికార మార్పు అనంతరం చెలరేగుతున్న విధ్వంస కాండలో భాగంగానే తన కార్యాలయంపై దాడి జరిగిందని హల్దార్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో అక్రమంగా దాచిపెట్టినదేమీ లేదన్నారు. సహాయక సామగ్రిని తామే కొనుగోలు చేశామని, వరదలు వచ్చిన పక్షంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా వాటిని పంచిపెట్టాలని అనుకున్నామని చెప్పారు. పార్టీ కార్యాలయం విధ్వంసం వెనుక బీజేపీ హస్తం ఉందని స్థానిక టీఎంసీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. ఇలాంటి ఘటనల్లో తమ కార్యకర్తలు ప్రమేయం ఎప్పుడూ ఉండదన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎన్నికల అనంతర హింస.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

మాజీ సీఎం మమత ఇంట్లో మీటింగ్.. ఎమ్మెల్యేల డుమ్మా?

Updated Date - May 31 , 2026 | 09:49 PM