Share News

క్రీడలు..డిజిటల్‌..గవర్నెన్స్‌

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:26 AM

దేశీ డిజిటల్‌ మాధ్యమాలకు ఊపునిచ్చేలా 23 సూత్రాల కార్యక్రమాన్ని(రోడ్‌ మ్యాప్‌) ప్రధాని మోదీ సిద్ధం చేశారు. 2036లో భారత్‌లో జరిగే ఒలింపిక్స్‌ లక్ష్యంగా రాబోయే పదేళ్ల...

క్రీడలు..డిజిటల్‌..గవర్నెన్స్‌

  • వికసిత్‌ భారత్‌-2047 కోసం 23 సూత్రాల కార్యక్రమం రెడీ

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశీ డిజిటల్‌ మాధ్యమాలకు ఊపునిచ్చేలా 23 సూత్రాల కార్యక్రమాన్ని(రోడ్‌ మ్యాప్‌) ప్రధాని మోదీ సిద్ధం చేశారు. 2036లో భారత్‌లో జరిగే ఒలింపిక్స్‌ లక్ష్యంగా రాబోయే పదేళ్ల కాలానికి కార్య ప్రణాళికను ఆమోదించారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యసాధనలో యువత, పాఠశాలలు, వ్యవస్థలు.. చివరకు సీనియర్‌ సిటిజన్లను కూడా భాగం చేస్తూ, దానిని ఓ జన బాహుళ్య కార్యక్రమంగా మార్చాలని ప్రధాని ఆశిస్తున్నారు. 23 సూత్రాల కార్యక్రమంలో ఈ అంశాలను, లక్ష్యాలను పొందుపరిచారు. దీనిపై ఓ జాతీయ న్యూస్‌ చానల్‌ కథనం ప్రసారం చేసింది. దానిని అనుసరించి.. అన్ని విభాగాల కార్యదర్శులతో గత నెల ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా 23 సూత్రాల కార్యక్రమంపై కార్యదర్శులకు క్యాబినెట్‌ కార్యదర్శి లేఖ రాశారు.

ఆటలకు అగ్ర తాంబూలం: క్రీడలకు దేశంలో పెరిగిన ఆదరణను ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థులను స్కూలు, కాలేజీ స్థాయిలో; యువజనులను పట్టణాలు, గ్రామాల స్థాయిలో సమీకరించి, ఆటలు ఆడించి వారిలోని విశేష ప్రతిభను బయటకు తీసుకురావాలని నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్‌ లక్ష్యంగా దేశ యువతను కదిలించాలని సంకల్పించింది.

డిజిటల్‌కు ఊతం: దేశీ డిజిటల్‌ విధానాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనికోసం జోహో, స్నామ్‌, అరట్టయి తదితర డాక్యుమెంట్‌ సంబంధిత ప్లాట్‌ఫ్లామ్‌ల ద్వారా మన ఏఐ, మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు తమ డేటా సెక్యూరిటీని మెరుగుపరుచుకోవాలని సూచించింది.

గోడలు లేని పాలన : కార్యదర్శులతో జరిపిన సమావేశంలో ప్రధాని మోదీ, వారికి రాసిన లేఖలో క్యాబినెట్‌ కార్యదర్శి ఒకే విషయం నొక్కి చెప్పారు. పనిచేస్తున్న విభాగాల ప్రయోజనాలను కాదు.. ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా పట్టించుకోవాలంటూ ప్రభుత్వ యంత్రాంగ పరంగా సందేశం అందించారు. ఇంకా.. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 06:26 AM