Share News

విక్రమ్‌-1లో అంతరిక్షంలోకి దిగ్గజ శాస్త్రవేత్తల విగ్రహాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 07:16 AM

దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్‌ ఏరోస్పేస్‌.. ‘మిషన్‌ ఆగమన్‌’ పేరిట విక్రమ్‌-1 రాకెట్‌ను ప్రయోగించేందుకు...

విక్రమ్‌-1లో అంతరిక్షంలోకి దిగ్గజ శాస్త్రవేత్తల విగ్రహాలు

సూళ్లూరుపేట, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్‌ ఏరోస్పేస్‌.. ‘మిషన్‌ ఆగమన్‌’ పేరిట విక్రమ్‌-1 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అయితే ఈ చరిత్రాత్మక ప్రయోగంలో భాగంగా ముగ్గురు దిగ్గజ శాస్త్రవేత్తలకు అరుదైన నివాళి అర్పించనుంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌... త్వరలో ప్రయోగించనున్న విక్రమ్‌-1 రాకెట్‌ ద్వారా సర్‌ సీవీ రామన్‌, డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సూక్ష్మ కళారూపాలను అంతరిక్షంలోకి పంపనుంది. ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్‌ అజయ్‌ కుమార్‌ మట్టెవాడ 18 క్యారెట్ల బంగారంతో ఈ కళారూపాలను రూపొందించారు. ఇవి ఒక్కొక్కటీ బియ్యం గింజ పరిమాణం కంటే చాలా చిన్నవిగా ఉండడం విశేషం. కాగా, ‘మిషన్‌ ఆగమన్‌’ పేరుతో శ్రీహరికోటలోని షార్‌లో జూలై 12 నుంచి ఆగస్టు 4వ తేదీల మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సన్నాహాలు చేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 07:16 AM