Share News

బస్సులు ఏర్పాటు చేయండి.. ఈసీకి టీవీకే అధినేత విజయ్ అత్యవసర లేఖ

ABN , Publish Date - Apr 23 , 2026 | 10:46 AM

టీవీకే అధినేత విజయ్ నటుడు విజయ్.. ఈసీకి అత్యవసర లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే..

బస్సులు ఏర్పాటు చేయండి.. ఈసీకి టీవీకే అధినేత విజయ్ అత్యవసర లేఖ
Vijay letter Election Commission

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. టీవీకే అధినేత విజయ్ నటుడు విజయ్.. ఈసీకి అత్యవసర లేఖ రాశారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో వేలాది మంది ఓటర్లు తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి సిద్ధపడ్డారని, అయితే రవాణా సౌకర్యాలు లేక వారు బస్టాండ్లలోనే చిక్కుకుపోయారని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల వేలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు.


‘చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బస్టాండ్లలో వేచి ఉన్న ఓటర్లను.. వారి వారి పోలింగ్ కేంద్రాలకు చేర్చడానికి వెంటనే ప్రత్యేక బస్సులను నడపాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో అందరికీ న్యాయం జరుగుతుంది. రవాణా ఇబ్బందుల వల్ల ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదు. ఓటర్ల పరిస్థితి అర్థం చేసుకొని ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. పోలింగ్ సమయాన్ని కూడా రెండు గంటలు మార్చితే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఉంటుంది’ అని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 10:55 AM