ఒకే వేదికపై విజయ్, జగన్, కేటీఆర్
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:15 AM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు.
చెన్నై, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు. చెన్నైలో జరిగిన వివాహ వేడుక ఇందుకు వేదికైంది. జగన్ బాబాయ్ వైఎస్ జార్జ్‌రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో జరిగింది. గురువారం చెన్నైలోని ఓ హోటల్లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు, విజయ్, నటి త్రిష హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జగన్, విజయ్ ఆత్మీయాలింగనం చేసుకున్నారు. విజయ్, జగన్, కేటీఆర్ సరదాగా ముచ్చటించుకున్నారు. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు. వేదిక ముందు వరుసలో గౌతం అదానీతో కలిసి విజయ్, జగన్ కూర్చుని మాట్లాడుతూ కనిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..
అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత