Share News

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌.. వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా

ABN , Publish Date - Nov 07 , 2026 | 03:54 AM

వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మాజీ ప్రమోటర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్‌ నందలాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ ప్రకటించింది.

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌..  వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా
venugopal

  • బ్యాంకులకు రూ.12,668 కోట్లు బకాయిపడిన వేణుగోపాల్‌

ముంబై, నవంబరు 6: వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ మాజీ ప్రమోటర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్‌ నందలాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ ప్రకటించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి వీడియోకాన్‌ సంస్థ తీసుకున్న రుణాలకు వేణుగోపాల్‌ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. రుణాలను ఆ సంస్థ తిరిగి చెల్లించటంలో విఫలం కావటంతో అసలు రుణం, వడ్డీ, పెనాల్టీలు కలిపి ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నాటికి రూ.12,668.06 కోట్లకు చేరాయి. దీంతో వేణుగోపాల్‌ను దివాలా తీసినట్లు ప్రకటించి, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకొని, వాటి ద్వారా తమ అప్పులు చెల్లించాలని ఎన్‌సీఎల్‌టీలో ఎస్‌బీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారించిన వినయ్‌గోయల్‌(జ్యుడీషియల్‌ సభ్యుడు), చరణ్‌జీత్‌ సింగ్‌ గులాటీ(టెక్నికల్‌ సభ్యుడు)లతో కూడిన బెంచ్‌ గురువారం ఈ ఆదేశాలిచ్చింది. దివాలా పరిష్కార ట్రస్టీగా ఆశిష్‌ నారాయణ్‌ను నియమించింది. తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను ఏడు రోజుల్లోగా ట్రస్టీకి అప్పగించాలని వేణుగోపాల్‌ను ఆదేశించింది. అనంతరం రుణదాతలతో చర్చించి 90 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని ట్రస్టీకి సూచించింది. ఈ వివాదం 2018 నుంచి నడుస్తోంది. వీడియోకాన్‌ సంస్థ రుణాలు తిరిగి చెల్లించకపోవటంతో 2018 ఫిబ్రవరిలో వేణుగోపాల్‌కు ఎస్‌బీఐ కన్సార్టియం నోటీసులిచ్చింది

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 03:54 AM