ముందుగా వందేమాతరమే ఆలపించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:55 AM
జాతీయ గేయం, జాతీయ గీతం, రాష్ట్ర గీతాలు ఆలపించడంపై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలకు రాష్ట్ర గీతాలు...
న్యూఢిల్లీ, జూలై 11: జాతీయ గేయం, జాతీయ గీతం, రాష్ట్ర గీతాలు ఆలపించడంపై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలకు రాష్ట్ర గీతాలు ఉన్నా ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, అనంతరం రాష్ట్ర గీతం ఆలపించాలని తెలిపింది. ఈ క్రమాన్ని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలను పంపింది. తమిళనాడులో ఇటీవల కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సమయంలో రాష్ట్ర గీతాన్ని చివర్లో పాడటంపై రాజకీయ దుమారం రేగడంతో కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి గల 6చరణాల వందేమాతరం పాడే సమయంలో గౌరవంగా నిలబడాలని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News