హైవేపై కారు ప్రమాదం.. శకున్ గ్రూప్ ఎండీ మృతి..
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:57 PM
శకున్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లభ్ మహేశ్వరి ప్రయాణిస్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బారికేడ్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లభ్ చనిపోగా.. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
జైపూర్, మార్చి 9: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శకున్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లభ్ మహేశ్వరి ప్రయాణిస్తున్న బీఎమ్‌డబ్ల్యూ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బారికేడ్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లభ్ చనిపోగా.. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శకున్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లభ్ మహేశ్వరి ఆదివారం సాయంత్రం బీఎమ్‌డబ్ల్యూ కారులో జైపూర్ నుంచి మధుర బయలుదేరారు. కారు రేని పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేపై వెళుతుండగా అదుపు తప్పింది.
బారికేడ్లను ఢీకొట్టి కల్వర్ట్ దగ్గర బోల్తా పడింది. ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వల్లభ్‌తో పాటు డ్రైవర్‌కు కూడా గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడ్డ ఇద్దరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వల్లభ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అల్వార్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వల్లభ్‌ను పరీక్షించిన అక్కడి వైద్యులు ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ను చూడగానే పరుగో పరుగు
క్షణికావేశంతో సోదరిని 40 సార్లు పొడిచి చంపిన యూట్యూబర్..