Share News

యుద్ధనౌకపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం!

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:18 AM

ఇరాన్‌పై యుద్ధం కోసం అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది...

యుద్ధనౌకపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం!

  • 8నెలలుగా విధుల్లో ఉండటం, ఆహారం, నీటి కొరతతో

సైనికుల నైరాశ్యం.. అమెరికా పత్రికల్లో కథనాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఇరాన్‌పై యుద్ధం కోసం అరేబియా సముద్రంలో మోహరించి ఉన్న యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. సుమారు ఎనిమిది నెలలుగా యుద్ధనౌకపై విధుల్లో ఉన్న సైనికులు నైరాశ్యంలో కూరుకుపోతున్నారని, ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు ఇళ్లకు తిరిగివెళతామోననే ఆందోళనతో సైనికులు కుంగిపోతున్నారు. ఈ మేరకు అబ్రహం లింకన్‌ యుద్ధనౌకలో విధుల్లో ఉన్న సైనికుల కుటుంబాలను ఉటంకిస్తూ.. అమెరికాకు చెందిన మిలిటరీ టైమ్స్‌, ది క్రెడిల్‌, మరికొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఆత్మహత్యాయత్నం చేసిన సైనికులకు సంబంధించి వారి కుటుంబాలకు నౌకాదళం అంబుడ్స్‌మెన్‌ నుంచి సమాచారం అందిందని, ఆరుగురు ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసిందని పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:18 AM