విద్యార్థి వీసాల ప్రాసెసింగ్‌లో జాప్యం..
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:16 AM
భారతీయలతో సహా అంతర్జాతీయ విద్యార్థుల వీసా ప్రాసెసింగ్‌లో జాప్యంపై 30మంది అమెరికా సెనేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోకు...
30 మంది అమెరికా సెనేటర్ల ఆందోళన
వివరణ కోరుతూ విదేశాంగ శాఖకు లేఖ
వాషింగ్టన్, ఆగస్టు 13: భారతీయలతో సహా అంతర్జాతీయ విద్యార్థుల వీసా ప్రాసెసింగ్‌లో జాప్యంపై 30మంది అమెరికా సెనేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోకు కాలిఫోర్నియా సెనేటర్ అలెక్స్ పడిల్లా నేతృత్వంలోని సెనేటర్లు ఇటీవల ఒక లేఖ రాశారు. పలు అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లు అందుబాటులో ఉండటం లేదని తమకు సమాచారం అందినట్లు తెలిపారు. దీనివల్ల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులు, ఎక్చ్సేంజ్ విజిటర్లు అమెరికాకు చేరుకోలేకపోవచ్చని పేర్కొన్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌లో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖను కోరారు. అర్హులైన విద్యార్థులకు ఇంటర్వ్యూ మినహాయింపులను పొడిగించడంతో పాటు సోషల్ మీడియా వెట్టింగ్, వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు సరిపడా సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..