18శాతం టారిఫ్‌ను ఖాయం చేసుకోండి
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:04 AM
భారత్‌తో త్వరగా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్న అమెరికా తొలుత మధ్యంతర ప్యాకేజీని అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఫిబ్రవరి నెలలో కుదిరిన...
ఉల్లంఘనలపై జరిమానాలు విధించం
భారత్‌కు ప్రతిపాదించనున్న అమెరికా
న్యూఢిల్లీ, జూన్ 1: భారత్‌తో త్వరగా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్న అమెరికా తొలుత మధ్యంతర ప్యాకేజీని అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఫిబ్రవరి నెలలో కుదిరిన ‘ఫ్రేం వర్క్’ అవగాహన మేరకు భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై ఆ దేశం 18ు టారిఫ్ విఽధించే అవకాశం ఉంది. ఈ 18% టారి్‌ఫను అంగీకరించాలంటూ ప్రస్తుతం ప్రతిపాదించే సూచనలు ఉన్నాయి. అలా చేస్తే వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై సెక్షన్ 301 కింద జరుగుతున్న విచారణలు ముగిసే వరకు జరిమానాలు విధించబోమన్న హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా అదనపు జరిమానాలు ఉండబోవన్న హామీ కూడా ఇవ్వనుంది. దీర్ఘకాలంలో వాణిజ్య లోటు తగ్గితే టారిఫ్ తగ్గిస్తామన్న వాగ్దానం కూడా చేయనుంది. భారత్ వస్తువులు, సేవలపై విధించే టారి్‌ఫను 50ు నుంచి 18 శాతానికి తగ్గించడానికి, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినందుకు విధించిన 25ు జరిమానాను రద్దు చేయడానికి ఫిబ్రవరి నెలలో అమెరికా అంగీకరించింది. దానినే ప్రస్తుతం కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకు అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి వాణిజ్య బృందం సోమవారం భారత్ చేరుకుంది. భారత వాణిజ్య మంత్రి గోయల్ సోమవారం ఇక్కడ మాట్లాడుతూ ఒప్పందంలోని మొదటి దశపై దాదాపుగా అంగీకారం కుదిరిందని, ప్రస్తుతం చిన్నచిన్న విషయాలపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఒప్పందం మొదటి దశను ఖరారు చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం