Share News

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jun 01 , 2026 | 07:15 PM

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు.

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
Yogi Adityanath

లక్నో: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ కొందరు ముస్లిం మౌల్వీలు చేస్తున్న డిమాండ్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. చెప్పేదొకటి..చేసేదొకటి అనే రితీలో ద్వంద్వ ప్రమాణాలు తగదని హితవు పలికారు. గోమాత ఎప్పుడూ దేశానికి తల్లిగానే ఉంటూ వచ్చిందని, జాతీయ హోదా చెల్లుబాటును లాంఛనంగా ప్రకటించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.


'ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు మౌలానాలు డిమాండ్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. గోవు ఇప్పటికే మన తల్లి. ఆవులతో మనబంధం ఈనాటిది కాదు. కాలానికి అతీతమైన అనుబంధం ఇది. తల్లీ, పిల్లల మధ్య అనుబంధాన్ని కొత్తగా నిర్వచించడం, లాంఛనపూర్వక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు' అని బిజ్నోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి పేర్కొన్నారు.


'ఒకవైపు మీరు (ముస్లిం మౌల్వీలు) పశువధను ప్రోత్సహిస్తూ, మరోవైపు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని డిమాండ్ చేస్తున్నారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు అద్దంపడుతోంది' అని యోగి ఘాటుగా విమర్శించారు. పశువధకు పాల్పడే వారిని తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని, పశువధ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో భవిష్యత్ తరాలకు కూడా అర్ధమయ్యేలా చేస్తామని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

నేను సీఎంను కాను.. ప్రజా సేవకుడిని: తమిళనాడు సీఎం విజయ్

అన్నామలై '2.0 అవతార్' పోస్టర్ల కలకలం

Updated Date - Jun 01 , 2026 | 07:26 PM