Share News

హెచ్‌-1బీ వీసాలకు మూడేళ్లు బ్రేక్‌!

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:10 AM

అమెరికాలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు షాక్‌ ఇచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌-1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని...

హెచ్‌-1బీ వీసాలకు మూడేళ్లు బ్రేక్‌!

అమెరికా చట్ట సభలో రిపబ్లికన్‌ నేత బిల్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: అమెరికాలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు షాక్‌ ఇచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌-1బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మూడేళ్ల పాటు నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్‌ ప్రతినిధి ఎలీ క్రేన్‌ బుధవారం చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఎండ్‌ హెచ్‌-1బీ వీసా అబ్యూజ్‌ యాక్ట్‌ ఆఫ్‌ 2026’ పేరిట ఆయన ఈ బిల్లును ప్రతిపాదించారు. మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమైనప్పుడు గణనీయమైన సంస్కరణలు అమలు చేయడం ద్వారా వీసా జారీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచించారు. ఈ బిల్లుకు పలువురు రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు తెలిపారు. హెచ్‌-1బీ వీసాల వార్షిక పరిమితిని 65వేల నుంచి 25వేలకు తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న మినహాయింపులను కూడా తొలగించాలని బిల్లులో పేర్కొన్నారు. హెచ్‌-1బీకి కనీసం 2 లక్షల డాలర్ల వార్షిక వేతనం తప్పనిసరి చేయాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 06:10 AM