Share News

యూపీఎస్‌సీ సివిల్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:55 AM

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌-2026 పరీక్షా ఫలితాలను యూపీఎ్‌ససీ గురువారం విడుదల చేసింది.

యూపీఎస్‌సీ సివిల్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల
upsc

అర్హత సాధించిన 2,526 మంది అభ్యర్థులు

న్యూఢిల్లీ, నవంబరు 5: సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌-2026 పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. 2,526 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు (వ్యక్తిత్వ పరీక్ష) అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌ ఆధారంగా ఫలితాలను upsc.gov.in పోర్టల్‌పై ఉన్న పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్‌సీ సూచించింది. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారంలో అవసరమైన వివరాలను నమోదు చేయాలని.. నవంబరు 11 నుంచి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, కులం, ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌), పర్సన్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిజేబిలిటీ (పీడబ్ల్యూబీడీ) తదితర ఒరిజినల్‌ కాపీలను ఇంటర్వ్యూ సమయంలో పరిశీలనకు వీలుగా సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్

బ్లింకిట్ అంబులెన్స్ సేవల్లో మార్పులు.. ఇకపై నాన్ ఎమర్జెన్సీ బుకింగ్‌కు రూ.2,500

Updated Date - Nov 06 , 2026 | 06:51 AM