Share News

ఇదేం వింత కోరికరా బాబు.. సెంట్రల్ జైల్ అంటే సరదా అనుకున్నావా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:47 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెంట్రల్ జైలుకు వెళ్లటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం భార్యను తుపాకితో బెదిరించాడు.

ఇదేం వింత కోరికరా బాబు.. సెంట్రల్ జైల్ అంటే సరదా అనుకున్నావా?
UP viral video

లఖ్‌నవూ, జూన్ 4: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెంట్రల్ జైలుకు వెళ్లటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం భార్యను తుపాకితో బెదిరించాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎటావా జిల్లాలోని ఐహేరీపూర్ గ్రామానికి చెందిన కోమల్ అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కోమల్‌కు ఎటావా సెంట్రల్ జైల్ చూడాలని ఆశ కలిగింది. సెంట్రల్ జైలుకు వెళ్లడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. నాటు తుపాకితో తన భార్యను బెదిరించాడు. ఆ తర్వాత నాటు తుపాకి తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు.


నాటు తుపాకి, క్యాట్రిడ్జ్‌లను పోలీసులకు స్వాధీనం చేశాడు. భార్యను తుపాకితో బెదిరించినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో స్థానిక మీడియా ప్రతినిధులతో కోమల్ మాట్లాడుతూ.. ‘ఎటావా సెంట్రల్ జైల్ చూడాలని అనిపించింది. అందుకే నా భార్యను తుపాకితో బెదిరించాను. నేను నా భార్యతో విడిపోవాలని అనుకోవటం లేదు. మా మధ్య పెద్ద గొడవలేమీ లేవు. ఎటావా జైలుకు వెళ్లాలనే ఇలా చేశాను’..


‘హత్య చేస్తే జీవితాంతం జైలులో ఉండాలి. ఇప్పుడైతే 6 నెలల్లో బయటకు వస్తా’ అని అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అతడి మానసిక పరిస్థితి సరిగా లేదు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు’..‘సెంట్రల్ జైలు చూడ్డం కోసం తుపాకితో భార్యను బెదిరించాడు. అతడి ప్రవర్తన చాలా డేంజర్‌గా ఉంది’.. అని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కోట్లాది హృదయాల్లో శాశ్వతంగా మార్మోగే స్వరం ఎస్పీ బాలుది: సీఎం చంద్రబాబు

రేపటి నుంచి విద్యార్థులకు బస్‌పాస్‏లు

Updated Date - Jun 04 , 2026 | 09:55 AM