సుంకాల సొమ్ము రీఫండ్లపై సందిగ్ధత!
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:34 AM
ట్రంప్ అదనపు సుంకాలను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు.. ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలా? ఏం చేయాలన్న అంశాన్ని ప్రస్తావించలేదు. దీనితో రీఫండ్ ఉంటుందా, లేదా? అన్నది...
ట్రంప్ అదనపు సుంకాలను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు.. ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలా? ఏం చేయాలన్న అంశాన్ని ప్రస్తావించలేదు. దీనితో రీఫండ్ ఉంటుందా, లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ రీఫండ్ చేసినా ఆ సొమ్ము మొత్తం వివిధ దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకున్న అమెరికన్ సంస్థలకే అందుతుందని.. భారత్‌గానీ, మరే దేశ సంస్థలకుగానీ ఆ సొమ్ము అందదని వాణిజ్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సాంకేతికతంగా ట్రంప్ సుంకాలు దిగుమతులపై విధించినవి కావడమే ఇందుకు కారణమని వివరిస్తున్నాయి. దిగుమతి చేసుకున్న అమెరికన్ సంస్థలు/వ్యక్తులుగానీ.. వివిధ దేశాల నుంచి ఎగుమతులు చేసిన సంస్థలు/ వ్యక్తులుగానీ ఎవరు సుంకాల సొమ్మును భరించినా.. అది దిగుమతి చేసుకున్నవారి పేరిటే ప్రభుత్వానికి చేరుతుందని పేర్కొంటున్నాయి. కాగా, తాము చెల్లించిన దిగుమతి సుంకాల సొమ్మును రీఫండ్ చేయాలంటూ అమెరికా ప్రభుత్వంపై అక్కడి పలు సంస్థలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ రీఫండ్ చేయాలని కోర్టులు ఆదేశించినా.. ఆ సొమ్ము అందేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ట్రంప్ అదనపు సుంకాల కారణంగా తమ రాష్ట్ర రైతులు, పరిశ్రమలపై తీవ్ర భారం పడిందని, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని.. అందువల్ల తమ రాష్ట్రానికి రూ.81 వేల కోట్లు (9 బిలియన్ డాలర్లు) రీఫండ్‌గా ఇవ్వాలని అమెరికాలోని ఇల్లినాయీ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారికంగా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ కూడా రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News