Share News

ప్రత్యేక ప్రాంతాలుగా.. అరుణాచల్‌, ఆక్సాయ్‌ చిన్‌!

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:38 AM

ఆక్సాయ్‌ చిన్‌.. చైనా ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, అరుణాచల్‌ ప్రదేశ్‌.. పూర్తిగా భారత ఆధీనంలోనే ఉన్నా కూడా తమదంటూ చైనా వాదిస్తున్న భూభాగం.. రెండూ తమవేనని...

ప్రత్యేక ప్రాంతాలుగా.. అరుణాచల్‌, ఆక్సాయ్‌ చిన్‌!

  • వివాదాస్పదంగా ఐక్యరాజ్యసమితి కొత్త ప్రపంచ మ్యాప్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఆక్సాయ్‌ చిన్‌.. చైనా ఆక్రమణలో ఉన్న భారత భూభాగం, అరుణాచల్‌ ప్రదేశ్‌.. పూర్తిగా భారత ఆధీనంలోనే ఉన్నా కూడా తమదంటూ చైనా వాదిస్తున్న భూభాగం.. రెండూ తమవేనని భారత్‌ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. కానీ ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన కొత్త ప్రపంచ మ్యాప్‌లో ఈ రెండు భూభాగాలను ప్రత్యేక ప్రాంతాలుగా చూపడం వివాదాస్పదంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల భూభాగాలను వాస్తవ పరిణామంలో చూపించేలా కొత్త మ్యాప్‌ను రూపొందించడంపై ఐక్యరాజ్యసమితి ‘కరెక్ట్‌ ద మ్యాప్‌’ పేరిట తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దానికి భారత్‌ సహా 164 దేశాలు మద్దతు ఇచ్చాయి. అయితే.. దీనికి సంబంధించి విడుదల చేసిన ప్రపంచ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌, ఆక్సాయ్‌ చిన్‌లను ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు నాగాలాండ్‌ రాష్ట్రంతో ఉన్న సరిహద్దును దేశాల మధ్య సరిహద్దు తరహాలోకి మార్చేసి.. భారత్‌-చైనా మధ్య ప్రత్యేక ప్రాంతంగా చిత్రీకరించారు. అటు ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతాన్ని కూడా ఒకవైపు భారత్‌లోని లడఖ్‌, మరోవైపు చైనాలోని టిబెట్‌ సరిహద్దులుగా ప్రత్యేక ప్రాంతంగా చూపారు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా చూపకుండా... పీఓకేను వేరుచేస్తూ చుక్కల గీతను మ్యాప్‌లో పెట్టారు. దీనికి మాత్రం ‘ఎల్‌ఓసీపై భారత్‌-పాక్‌ అంగీకరించిన సరిహద్దును చుక్కల రేఖతో సూచించాం’’ అని మ్యాప్‌ కింద నోట్‌ పెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 05:38 AM