Share News

టైప్‌-2 మధుమేహం ఉంటే డెంగీ ముప్పు అధికం

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:23 AM

టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడేవారికి డెంగీ జ్వరం ముప్పు అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణుల అధ్యయనంలో తేలింది. రొటీన్‌గా చేసుకునే...

టైప్‌-2 మధుమేహం ఉంటే డెంగీ ముప్పు అధికం

  • వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచిది.. నిపుణుల అధ్యయనంలో వెల్లడి

తిరువనంతపురం, జూలై 19: టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడేవారికి డెంగీ జ్వరం ముప్పు అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని నిపుణుల అధ్యయనంలో తేలింది. రొటీన్‌గా చేసుకునే డయాబెటీస్‌ పరీక్షల్లో భాగంగా డెంగీ వ్యాక్సిన్‌ను కూడా తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సిఫార్సు చే శారు. ప్రముఖ డయాబెటాలజిస్ట్‌ డాక్టర్‌ జోతిదేవ్‌ కేశవ్‌దేవ్‌ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. ఈ పరిశోధనలో యూరోప్‌ డయాబెటీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయిన డాక్టర్‌ నీతి పాల్‌తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ పరిశోధన వివరాలు ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ అండ్‌ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయి. ఈ వివరాలను ఆదివారం ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. బ్లడ్‌ సుగర్‌ అధికంగా ఉంటే రక్త కణాలు దెబ్బతింటాయి. ఆ కారణంగా డెంగీ జ్వరం సోకితే దాని తీవ్రత కూడా అధికం కానుంది. అలాంటి వారి శరీరాల్లో ఉష్ణోగ్రతలు అధికమయి ‘సైటోకిన్‌ స్ట్రోమ్‌’కు దారి తీసే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల శరీరం లోపల రక్తస్రావం జరగడం, రక్తస్రావ జ్వరాలు రావడం, బీపీ తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల షుగర్‌ పరీక్షలు చేయించుకునే సందర్భంలోనే వ్యాక్సిన్లు కూడా వేసుకుంటే ముప్పు తప్పుతుందని డాక్టర్‌ కేశవ్‌దేవ్‌ చెప్పారు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 06:23 AM