Share News

భారత ఎన్నికల వ్యవస్థ భేష్‌!

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:38 AM

అమెరికాలో కఠినమైన ఎన్నికల చట్టాలను అమలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ నొక్కిచెప్పారు. ‘సేఫ్‌గార్డ్‌ అమెరికన్‌ ఓటర్‌ ఎలిజిబిలిటీ..

భారత ఎన్నికల వ్యవస్థ భేష్‌!

  • ‘సేవ్‌ అమెరికా’ యాక్ట్‌ అత్యవసరం: ట్రంప్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికాలో కఠినమైన ఎన్నికల చట్టాలను అమలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ నొక్కిచెప్పారు. ‘సేఫ్‌గార్డ్‌ అమెరికన్‌ ఓటర్‌ ఎలిజిబిలిటీ (సేవ్‌) అమెరికా’ యాక్ట్‌ను వెంటనే ఆమోదించుకోవాలని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో భారత్‌లోని ఎన్నికల వ్యవస్థను ఆయన ప్రశంసించారు. భారత్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 64.60 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నప్పటికీ 1ు కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓట్లు వేశారన్నారు. భారత్‌లో ప్రతి ఒక్క ఓటరు వద్ద చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోవడానికి అమెరికన్లు తమ పౌరసత్వ రుజువును చూపించడాన్ని తప్పనిసరి చేయడం, పోస్టల్‌ ఓటింగ్‌ను పరిమితం చేసే దిశగా ‘సేవ్‌ అమెరికా’ యాక్ట్‌కు మద్దతు కూడగట్టేందుకు ఆయన ఇరు దేశాల ఎన్నికల వ్యవస్థలను పోల్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 06:38 AM