Share News

ఔషధాలపై ట్రంప్‌ సుంకాల పిడుగు

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:56 AM

అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల కొరడా ఝళిపించారు. అమెరికా ఔషధరంగాన్ని బలోపేతం చేయడంతోపాటు...

ఔషధాలపై ట్రంప్‌ సుంకాల పిడుగు

  • జనరిక్‌ మందులపై డబుల్‌ బాదుడు

  • 2028 నుంచి 100ు, 2029 నుంచి 200ు

  • భారత పరిశ్రమలపై ప్రభావం: నిపుణులు

న్యూఢిల్లీ, జూలై 22: అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల కొరడా ఝళిపించారు. అమెరికా ఔషధరంగాన్ని బలోపేతం చేయడంతోపాటు, విదేశాలకు తరలిపోయిన ఔషధ పరిశ్రమలను తిరిగి రప్పించడమే లక్ష్యంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచారు. అన్ని జనరిక్‌ ఔషధాలపై 2028, ఆగస్టు నుంచి 100 శాతం, తదుపరి సంవత్సరం 2029, ఆగస్టు నుంచి 200 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. సుంకాల విధింపును ఆయన సమర్థించుకున్నారు. అమెరికా ఫార్మారంగాన్ని బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నూతన విధానం మేరకు ఈ ఏడాది ఆగస్టు నుంచి 2028, ఆగస్టు వరకు జనరిక్‌ ఔషధాలపై సుంకాలను పూర్తిగా ఎత్తేశారు. అయితే, ఆ తర్వాత మాత్రం రెట్టింపు సుంకాలు విధించనున్నారు. కాగా, ట్రంప్‌ నిర్ణయం భారత ఔషధ ఎగుమతి రంగానికి భారీ దెబ్బేనని నిపుణులు చెబుతున్నారు. దేశం నుంచి ఏటా రూ.93 వేల కోట్లకు పైగా విలువైన ఔషధాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని, వీటిపై సుంకాలు విధిస్తే ఔషధ రంగం విలవిల్లాడుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు వాటి ఉత్పత్తుల్లో 40 నుంచి 50ు ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 06:11 AM