Share News

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..

ABN , Publish Date - Jun 27 , 2026 | 03:00 PM

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించటం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి తలపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో ఆ వ్యక్తి షాక్ తగిలినవాడిలా కుప్పకూలిపోయాడు.

తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..
Bengaluru biker accident

బెంగళూరు, జూన్ 27: ద్విచక్ర వాహనాలు నడుపుతున్నపుడు చోదకులు హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రమాదాలు జరిగినపుడు.. హెల్మెట్ కారణంగా ప్రాణాలు నిలబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించటం ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి తలపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో ఆ వ్యక్తి షాక్ తగిలినవాడిలా కుప్పకూలిపోయాడు. తలకు బలమైన గాయం కారణంగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ వివరాల్లోకి వెళితే..


సతీష్ అనే వ్యక్తి తన బైకుపై రాజాజీనగర్ ఏరియాలోని రామమందిర్ రోడ్ ఏరియాలో ప్రయాణించసాగాడు. ఓ చోట చెట్టు కొమ్మ విరిగి అతడి తలపై పడింది. హెల్మెట్ లేకపోవటంతో సతీష్ తలకు తీవ్రగాయం అయింది. దీంతో అతడు కరెంట్ షాక్ తగిలిన వాడిలా బిగుసుకుపోయి రోడ్డుపై కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తలకు అయిన గాయం కారణంగా అతడు కోమాలోకి వెళ్లిపోయాడు.


మణిపాల్ ఆస్పత్రి డాక్టర్లు ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించారు. దీంతో సతీష్ కోలుకుంటున్నాడు. ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వానాకాలం హెల్మెట్ లేకుండా చెట్లు ఉన్న ప్రాంతంలో నడవటం కూడా ప్రమాదమే’..‘ అతడి అదృష్టం చాలా బాగుంది. లేదంటే ప్రాణాలుపోయి ఉండేవి’.. ‘ఇలాంటి సంఘటనలు చూస్తే గుండె ఝల్లుమంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె

హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్‌ మ్యాన్‌ సూర్య భాయ్ అరెస్ట్

Updated Date - Jun 27 , 2026 | 03:08 PM