Share News

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:24 PM

మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది.

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..
TRAI 1601 series

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది. కొరియర్, లాజిస్టిక్స్, యుటిలిటీస్ సంస్థలు వినియోగదారులకు చేసే సేవా, లావాదేవీ సంబంధిత కాల్స్ కోసం 1601 సిరీస్ నంబర్లను అమల్లోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది (TRAI 1601 series).


ప్రస్తుతం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో నిజమైన సంస్థల కాల్స్ ఏవో, మోసగాళ్ల కాల్స్ ఏవో గుర్తించడం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. కొందరు మోసగాళ్లు విద్యుత్ సంస్థలు, కొరియర్ కంపెనీలు లేదా ఇతర సేవా సంస్థల పేర్లు చెప్పి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యను నివారించేందుకు ట్రాయ్ 1601 అనే ప్రత్యేక నంబర్ సిరీస్‌ను కేటాయించింది. దీంతో వినియోగదారులు సేవా, లావాదేవీ సంబంధిత కాల్‌ను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది (TRAI new rules 2026).


1601 నంబర్లను మధ్యవర్తులు లేదా కాల్ అగ్రిగేటర్లకు కాకుండా అర్హత ఉన్న సంస్థలకు నేరుగా కేటాయించనున్నారు (1601 numbers). టెలికాం సంస్థలు నంబర్ కేటాయించే ముందు సంబంధిత సంస్థ అర్హతను ధ్రువీకరించాలి. అంతేకాకుండా, కేటాయించిన నంబర్లను సేవా, లావాదేవీ కాల్స్‌కు మాత్రమే ఉపయోగిస్తామని సంస్థల నుంచి హామీ తీసుకోవాలి. కాగా, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థల కాల్స్ కోసం ఇప్పటికే 1600 సిరీస్‌ను కేటాయించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 07:24 PM