Share News

రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 12 మంది మృతి, 39 మందికి గాయాలు..

ABN , Publish Date - Aug 10 , 2026 | 06:24 PM

రష్యాలోని తాతర్‌స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.

రష్యాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 12 మంది మృతి, 39 మందికి గాయాలు..
Ukrainian drone attack

ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని తాతర్‌స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం (Ukrainian drone attack).


తాతర్‌స్తాన్‌లోని నిజ్నెకామ్స్క్ నగరంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. పారిశ్రామిక ప్రాంతాలతో పాటు నివాస ప్రాంతాలను కూడా డ్రోన్లు తాకినట్లు అధికారులు తెలిపారు. దాడిలో టానెకో చమురు శుద్ధి కర్మాగారం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడి సమయంలో చమురు శుద్ధి కర్మాగారం వద్ద మంటలు చెలరేగినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. టానెకో కర్మాగారం రష్యాలోని కీలక ఇంధన మౌలిక వసతుల్లో ఒకటి (Nizhnekamsk drone attack).


కొంతకాలంగా రష్యాలోని ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోంది (Russia Ukraine war). రష్యా యుద్ధ సామర్థ్యానికి అవసరమైన ఇంధన సరఫరాపై ఒత్తిడి తీసుకురావడం ఈ దాడుల వెనుక వ్యూహంగా కనబడుతోంది. కాగా, సోమవారం ఉక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై రష్యా కూడా దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, అనేక నివాసాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాజ్తు‌తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 06:26 PM