Share News

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. 3 నెలల్లో రూ.10 వేల కోట్ల ఆదాయం..

ABN , Publish Date - Aug 10 , 2026 | 05:58 PM

బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది.

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. 3 నెలల్లో రూ.10 వేల కోట్ల ఆదాయం..
gold import duty

ఇంటర్నెట్ డెస్క్: బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. మే 13 నుంచి ఆగస్టు 2 వరకు కేవలం మూడు నెలల్లోనే రూ.10,463 కోట్ల కస్టమ్స్ ఆదాయం సమకూరినట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కేంద్రం మే 13న సుంకాన్ని పెంచింది (Gold import duty).


మే 13 నుంచి ఆగస్టు 2 వరకు ఈ విలువైన లోహాల దిగుమతులపై వసూలైన కస్టమ్స్ సుంకం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో ప్రధాన వాటా బంగారం దిగుమతులదే. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, దిగుమతుల విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారంపై కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కాలంలో 161 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది (India gold imports).


నిజానికి గత మూడు నెలల కాలంలో బంగారం దిగుమతుల పరిమాణం పెరగలేదు (Gold duty hike). ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం, దిగుమతులపై సుంకాల పెంపు కారణంగానే ఈ స్థాయిలో ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత బంగారం దిగుమతుల విలువ దాదాపు 71.97 బిలియన్ డాలర్లకు చేరినట్టు గణాంకాలు వెల్లడించాయి.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాజ్తు‌తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 07:10 PM