Share News

రోజుకు రూ.8,300 కోట్లకు పైగా.. ఎలాన్ మస్క్ సంపదలో ఊహించని పెరుగుదల..

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:51 PM

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది.

రోజుకు రూ.8,300 కోట్లకు పైగా.. ఎలాన్ మస్క్ సంపదలో ఊహించని పెరుగుదల..
Elon Musk net worth

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణంగా పెరిగింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య ఆయన సంపద ఏకంగా 319.5 బిలియన్ డాలర్లు పెరిగిందని ఒక నివేదిక వెల్లడించింది. అంటే సగటున రోజుకు సుమారు 875 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8300 కోట్లు) చొప్పున సంపద పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి (Elon Musk net worth).


ఎలాన్ మస్క్ సంపద ప్రధానంగా టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థల్లో ఆయనకు ఉన్న వాటాల విలువతో ముడిపడి ఉంటుంది. గతేడాది కాలంలో ఈ కంపెనీల మార్కెట్ విలువల్లో భారీ పెరుగుదల చోటుచేసుకోవడంతో మస్క్ నికర సంపద కూడా వేగంగా పెరిగింది. ముఖ్యంగా స్పేస్‌ఎక్స్ ఐపీవో మస్క్ సంపదను సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది (Elon Musk $875 million per day).


స్పేస్ ఎక్స్ ఓపీవోకు అంచనాలకు మించిన డిమాండ్ రావడంతో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్లను దాటింది (Elon Musk fortune). అయితే ఆ తర్వాత ఆ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా మస్క్ సంపద కూడా భారీగా తగ్గింది. మస్క్ తర్వాత, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్ అతి ఎక్కువ సంపదను పోగేసిన వ్యక్తిగా నిలిచారు. 2025 జులై నుంచి 2026 జులై మధ్య డెల్ తన సంపదకు 107.6 బిలియన్ డాలర్లను జోడించారు.


ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాజ్తు‌తోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..


సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 10 , 2026 | 04:54 PM