ట్రంప్‌నకు ‘బొమ్మ’ కనిపించేలా చేసి..
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:29 AM
ఓ విధానం అంటూ లేకుండా ఇష్టారీతిన సుంకాల మోతతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టు దిమ్మతిరిగే తీర్పు...
సుంకాల వెనుక ఓ టాయ్స్ కంపెనీ న్యాయ పోరాటం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఓ విధానం అంటూ లేకుండా ఇష్టారీతిన సుంకాల మోతతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిందంటే దాని వెనుక ఓ బొమ్మల కంపెనీ చేసిన పోరాటమూ ప్రధానమైనదే! అమెరికాలోని ఇలినాయిస్ కేంద్రంగా ‘లెర్నింగ్ రిసోర్సెస్ లిమిటెడ్’ అనే బొమ్మల కంపెనీ వ్యాపారం నడుపుతోంది. ఈ కంపెనీకి ఎక్కువకు ఎక్కువ బొమ్మలు చైనా నుంచే వస్తాయి. ట్రంప్ చైనా మీద సుంకాల వాత పెట్టడంతో బొమ్మల ధరలు బాగా పెరిగాయి. ‘లెర్నింగ్ రిసోర్సెస్’ కంపెనీ బిజినెస్ దెబ్బతింది. దిక్కుతోచని స్థితిలో కంపెనీ యజమాని రిక్ వోల్డెన్‌బర్గ్ సుంకాలకు వ్యతిరేకంగా గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు పట్ల వోల్డెన్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News