బ్లడ్‌మూన్‌ను చూశారా..? సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ ఫోటోను చూసేయండి..!
ABN , Publish Date - Mar 03 , 2026 | 06:25 PM
ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది.
Blood Moon 2026: ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తి రక్తవర్ణంలో దగదగ మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు.. ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియా సంపూర్ణచంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లో రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రగ్రహణం సమయం..
చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.34 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 5.33 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం వీడుతుంది. అయితే, 6.47 గంటలకు గ్రహణం వీడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించిన ఈ సంపూర్ణ చంద్రగ్రహణం(బ్లడ్ మూన్) మన దేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే కనిపించింది.
ఆయా దేశాల్లో కనిపించిన బ్లడ్ మూన్ చిత్రాలు మీకోసం..
