టీఎంసీ మరో 12 బ్యాంకు ఖాతాల నిలిపివేత
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:52 AM
పశ్చిమ బెంగాల్ పోలీసులు టీఎంసీకి చెందిన మరో 12బ్యాంకు ఖాతాలను శుక్రవారం స్తంభింపజేశారు. రూ.440 కోట్లు ఉన్న మూడు...
కోల్‌కతా, జూలై 11: పశ్చిమ బెంగాల్ పోలీసులు టీఎంసీకి చెందిన మరో 12బ్యాంకు ఖాతాలను శుక్రవారం స్తంభింపజేశారు. రూ.440 కోట్లు ఉన్న మూడు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఖాతాలను పాక్షికంగా నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టు ఆ పార్టీని అనుమతించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం స్తంభింపజేసిన 12 బ్యాంకు ఖాతాలు పలు పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులకు చెందినవని సీనియర్ బెంగాల్ పోలీసు అధికారులు చెప్పారు. దీంతో మొత్తం రూ.1000 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న 15 బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు అయ్యింది. కాగా కోల్‌కతా హైకోర్టు అనుమతించిన మూడు ఖాతాల నిర్వహణకు రిటైర్డ్ జస్టిస్ సుబ్రతాతాలుక్‌దార్‌ని ప్రత్యేక అధికారిగా నియమించింది. పార్టీ రోజు వారి ఖర్చులు, సిబ్బంది జీతాలు, కోర్టు వ్యవహారాల ఖర్చులకు మాత్రమే ప్రత్యేక అధికారి సంతకం చేసిన చెక్కుల ద్వారా ఈ ఖాతాల నుంచి చెల్లించాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News